గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న కంగనా

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. బిఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వరల్డ్ వైడ్ గా ఎంతో ప్రాముఖ్యత సొంతం చేసుకుంది. ప్రతి ఒక్కరు మొక్క నాటడమే కాదు మరికొంతమందిని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపు తో ఇప్పటికే సినీ , రాజకీయ, క్రీడా ఇలా అనేక రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ఛాలెంజ్ లో పాల్గొని , ఇతరులకు మొక్కలు నాటాలని పిలుపునివ్వడం జరిగింది.
తాజాగా ఈ ఛాలెంజ్‌లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పాల్గొన్నారు. శంషాబాద్ లోని పంచవటి పార్క్‌లో కంగనా మొక్కలు నాటారు. ప్రముఖ జ్యోతిష్యుడు బాలు మున్నంగి ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటినట్లు కంగనా తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా రాజ్యసభ ఎంపి సంతోశ్ కుమార్ కోట్లాది మొక్కలు నాటడం గొప్ప విషయం అని కొనియాడారు.
ఈ ఛాలెంజ్ ను అందరూ స్వీకరించి మొక్కలు నాటాలని, పచ్చదనాన్ని పెంచాలని కంగనా కోరారు. అనంతరం తన సోదరి రంగోలి చందర్, డాక్టర్ రీతూ రనౌత్ , అంజలీ చౌహాన్‌లకు కంగన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. వారు కూడా ఈ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని కోరారు.