ఓటిటిలో ‘అర్జున్‌రెడ్డి’ రెండో సినిమా
నవంబర్‌లో విడుదల చేసే యోచన

తెలుగులో అర్జున్‌రెడ్డి చిత్రం పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే..
ఈ ఒక్క సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్‌నైట్ స్టార్ హీరో అయిపోగా, దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ అదే సినిమాను బాలీవుడ్లో కూడ తీసి ఇపుడు పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు..
అయితే ఈచిత్రాన్ని ఒక్క హిందీలోనే కాకుండా తమిళ్లో కూడా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.. కానీ ఆ ఒక్క ఇండస్ట్రీలో మాత్రమే ఈచిత్రాన్ని రెండు సార్లు తీశారు.
విలక్షణ నటుడు విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం చేస్తూ అక్కడి సంచలన చిత్రాల దర్శకుడు బాల వర్మ పేరిట ఈచిత్రాన్ని తీశారు.
కానీ ఈచిత్రం పూర్తయేటప్పటికీ ఫైనల్ అవుట్‌పుట్ ఎవరికీ రుచించకపోవటంతో మళ్లీ వేరే దర్శకునితో ఆదిత్య వర్మ గా తీసి సాలిడ్ హిట్ అందుకున్నారు.
దీంతో ముందు తీసిన చిత్రం అలా హోల్డ్‌లోనే ఉండిపోయింది.. కానీ ఇపుడు ఈచిత్రం మాత్రం డైరెక్ట్ స్ట్రీమింగ్‌లో విడుల కానున్నట్టు తెలుస్తోంది..
నవంబర్ నెలలో ప్రముఖ ఓటిటి ఫ్లాట్‌పామ్‌లో విడుదల చేసే ప్లానింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/