షూటింగ్‌కు రెడీ

ఈనెల 14నుంచి ‘రామోజీ’లో బోయపాటి-బాలయ్య మూవీ చిత్రీకరణకు ప్లాన్‌

Bala Krishna
Bala Krishna

‘నటసింహం’ నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా సెప్టెంబర్‌ 14 నుంచి షూటింగ్‌కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

దర్శక,నిర్మాతలు కొన్నాళ్లు ఆగుదాం అంటున్నా. పర్వాలేదు స్టార్ట్‌చేద్దామంటూ మొత్తం మీద బాలయ్య షూటింగ్‌కు డేట్స్‌ కూడ ఇచ్చేశారని తెలుస్తోంది..

రామోజీ ఫిల్మ్‌సిటీలోని విలేజ్‌ సెట్‌లో షూట్‌ స్టార్ట్‌కానుంది.. గ్రామీణ నేపథ్యంలో వచ్చే ఈసీన్స్‌లో బాలయ్య పంచెకట్టులో కన్పిస్తారట..

ఈచిత్రాన్ని మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తుండగా, థమన్‌ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాలో కొత్త హీరోయిన్‌ పరిచయం కానుందని బోయపాటి తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/