మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా?

సౌందర్య సంరక్షణ

Pimple marks

జిడ్డు, మొటిమలు ఉండే చర్మంపై మేకప్ వేసుకునే ముందు, ప్రైమర్ ను అప్లై చేయటం మంచిది. ఇది మేకప్ ను ఎక్కువ సేపు ఉంచటమే కాదు. తెరుచుకున్న రంధ్రాలను మూసివేస్తుంది..

మేకప్ వేసుకునేటపుడు శుభ్రతను తప్పనిసరిగా పాటించాలి. బ్రష్ ను ఎప్పటికపుడు కడగాలి. ఒకరు వాడిన బ్రష్ ను మరొకరు వాడొద్దు. దానిలో ఉండే బాక్టీరియా ముఖంపై ఏర్పడి చర్మంపై మొటిమలతో పాటు మాన్తా, దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది .

మొటిమలు ముఖంపై ఎర్రగా, మచ్చలుగా ఉంది చర్మం రంగును పాలిపోయినట్టు చేస్తాయి. వీటిని దాచటానికి, ఫౌండేషన్, కన్సీలర్లను ఉపయోగించే ముందు గ్రీన్ కలర్ కరెక్టర్ ను ఉపయోగించండి. ఇది మేకప్ ను కన్పించనీయకుండా చేస్తుంది.. అవసరమైన దాన్ని కంటే ఎక్కువ ఫౌండేషన్ ముఖంపై ఉండకుండా తేలికైన అనుభూతిని అందిస్తుంది..

చాలా మంది మేకప్ వేసుకున్న తర్వాత, దానితోనే నిద్రపోతారు.. అలా చేయటం వలన మొటిమలు మరింత తీవ్ర మవుతాయి.