చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చిన కెటిఆర్‌

ktr

హైదరాబాద్‌ః మార్చి ఒకటి నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. 150-200 మంది బిఆర్‌ఎస్‌ ప్రతినిధులతో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ భవన్‌ నుంచి మేడిగడ్డ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలిరోజు కాళేశ్వరం వెళ్తామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని తెలంగాణ ప్రజలతో పాటు ఆరోపణలు చేస్తున్న వారికి చూపిస్తామన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకే మేడిగడ్డకు వెళ్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ఏంటే ఏంటో సజీవంగా చూపిస్తామన్నారు. విడతల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టును సమగ్రంగా సందర్శిస్తామన్నారు.

‘రూ.లక్షకోట్ల విలువైన ప్రాజెక్టు అని ఒక వైపు చెబుతూ.. రూ.లక్షకోట్లు కొట్టుకుపోయిందని ఓవైపు చిల్లర మాటలు మాట్లాడుతూ.. రూ.3వేలకోట్ల బరాజ్‌ను అందులో 84 పిల్లర్లు ఉంటే.. మూడు పిల్లర్లకు ప్రమాదం వస్తే మొత్తం బరాజ్‌ కొట్టుకుపోయిందన్నంట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ కాదు. అన్నింటింకి మించి 40లక్షలకుపై చీలుకు ఎకరాలకు నీర్చి కామధేనువు కాళేశ్వరం. 88మీటర్ల ఎత్తు నుంచి సముద్రమట్టం మీద 618 మీటర్ల ఎత్తుకు గోదావరి గంగను పైకి ఏటికి ఎదురీదుతూపైకి తీసుకొని పోయే బృహత్తర కార్యక్రమం కాళేశ్వరం. తెలంగాణ టోఫోగ్రఫీకి తెలిసిన వారికి తెలుస్తుంది. తెలంగాణ దాదాపు ఒక గుడిసెలా ఉంటుంది. మధ్య హయ్యర్‌ ప్లాటో ఉంటే ఒక వైపు కృష్ణ, ఒక వైపు గోదావరి ప్రవహిస్తుంటుంది. పైన 535 మీటర్లపైన హైదరాబాద్‌లాంటి పట్టణం ఉంది. కొండపోచమ్మసాగర్‌ ప్రాంతం 618 మీటర్లు ఎత్తు ఉంది. లక్ష్మీదేవిపల్లి, షాద్‌నగర్‌ ఏరియాలో658 మీటర్లు. ఏటవాలుగా ఉండే పరిస్థితి తెలంగాణది’ అన్నారు.