స‌మాజ్‌వాదీ పార్టీ చీఫ్ విప్ మ‌నోజ్ పాండే రాజీనామా

Samajwadi Party Chief Whip Manoj Pandey resigns

ల‌క్నో: ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో రాజ్య‌స‌భ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. యూపీలోనూ 10 స్థానాల‌కు ఇవాళ ఓటింగ్ జ‌రుగుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో స‌మాజ్‌వాదీ పార్టీ చీఫ్ విప్ మ‌నోజ్ పాండే త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో స‌మాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్‌యాద‌వ్‌కు భారీ జ‌ల‌క్ త‌గిలింది. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో సోమ‌వారం ఓ పార్టీని అఖిలేశ్ ఆర్గ‌నైజ్ చేశారు. అయితే ఆ పార్టీకి మ‌నోజ్ పాండే హాజ‌రుకాలేదు. యూపీలో జ‌రుగుతున్న ప‌ది స్థానాల కోసం 8 మంది బిజెపి నుంచి, స‌మాజ్‌వాదీ పార్టీ నుంచి ముగ్గురు అభ్య‌ర్థులు పోటీలో ఉన్నారు.

మ‌నోజ్ పాండే త‌న రాజీనామా గురించి అఖిలేశ్‌కు లేఖ రాశారు. మీరు న‌న్ను యూపీ అసెంబ్లీ కోసం చీఫ్ విప్‌గా నియ‌మించారు. ఆ పోస్టుకు నేను రిజైన్ చేస్తున్నాను, దాన్ని మీరు ఆమోదించాల‌ని మ‌నోజ్ త‌న లేఖ‌లో కోరారు. రాయ్‌బ‌రేలీలోని ఉంచ‌హార్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌నోజ్ పాండే ఎమ్మెల్యేగా ఉన్నారు. గ‌త అఖిలేశ్ స‌ర్కారులో ఆయ‌న మంత్రిగా చేశారు.

సోమ‌వారం జ‌రిగిన ఎస్పీ మీటింగ్‌కు.. ఆ పార్టీకే చెందిన 8 మంది నేత‌లు హాజ‌రుకాలేదు. మ‌నోజ్‌తో పాటు ముకేశ్ వ‌ర్మ‌, మ‌హారాజి ప్ర‌జాప‌తి, పూజా పాల్‌, రాకేశ్ పాండే, వినోద్ చ‌తుర్వేది, రాకేశ్ ప్ర‌తాప్ సింగ్, అభ‌య్ సింగ్ ఆ మీటింగ్‌కు వెళ్ల‌లేదు.