జెల్‌ నెయిల్‌ పాలిష్‌ తొలగించే తీరు..

అందమే ఆనందం

How to remove gel nail polish
remove gel nail polish

మహిళలకు సౌందర్యం అంటే కేవలం ముఖం మాత్రమే కాదు, కురుల నుంచి కాలి గోటి వరకు ప్రతి విషయంలోను శ్రద్ధ తీసుకుంటారు.

ప్రస్తుతం గోళ్లరంగులో జెల్‌ నెయిల్‌ పాలిష్‌ ఒక ట్రెండ్‌ అయింది. అందుకే అనేక మంది పార్లర్‌కు వెళ్లి మరి గోళ్లకు ఈ జెల్‌ నెయిల్‌ పాలిష్‌ వేయించుకుంటారు.

అయితే దీనికి తొలగించడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. అయినప్పటికీ సులభంగా తొలగించేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.

జెల్‌ నెయిల్‌ పాలిష్‌ సాధారణ నెయిల్‌ పాలిష్‌ మాదిరిగా ఉందు. దీన్ని తొలగించేందుకు ముందుగా నెయిల్‌ ఫైలర్‌ను ఉపయోగించాలి.

పాలిష్‌ యొక్క మెరిసే టాప్‌ కోట్‌ని తొలగించాలి. గోళ్లపై ఉన్న జెల్‌ పాలిష్‌ పొరను తొలగించిన తర్వాత, గోళ్ల చుట్టూ ఉండే చర్మానికి క్యూటికల్‌ ఆయిల్‌, క్రీమ్‌ రాయాలి. దీనివల్ల గోళ్ల చుట్టూ ఉండే చర్మం మృదువుగా ఉంటుంది.

ఆసిటోన్‌లో నానబెట్టిన కాటన్‌ బాల్స్‌ను తీసుకుని గోళ్లపై ఉంచాలి. అల్యూమినియం ఫాయిల్‌ను ఉపయోగించి పూర్తిగా కవర్‌ చేయాలి.

అలాగే పది నిమిషాలు ఉంచి తీసేస్తే జెల్‌ పాలిష్‌ పొరలు పొరలుగా వచ్చేస్తుంది. అయితే ఇది చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. లేదంటే గోళ్లు పాడయ్యే ప్రమాదముంటుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/