పిడుగురాళ్లలో ఘోరం..వైసీపీ ఫ్లెక్సీలు చింపారంటూ మైనర్ విద్యార్థులను పోలీస్ స్టేషన్ లో పెట్టిన పోలీసులు

ఏపీలో ప్రతి రోజు ఏదొక ఘటన సర్కార్ కు తలనొప్పిగా మారుతుంది. అధికారుల నిర్లక్ష్యం, పోలీసుల అతి ఉత్సహం వల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శల పలు చేస్తుంది. మొన్నటికి మొన్న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి లో యువతీ ఫై అత్యాచారం..నిన్న తిరుపతి రుయా ఆసుపత్రి ఘటన..ఈరోజు పిడుగురాళ్లలో వైసీపీ ఫ్లెక్సీలు చింపారంటూ మైనర్ విద్యార్థులను పోలీస్ స్టేషన్ లో పెట్టడం ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టించాయి.

పిడుగురాళ్ళ మండలం జానపాడు లో విద్యార్థులు ఆడుకుంటుండగా ఫ్లెక్సీలు పొరపాటున చిరిగాయి. తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చిరగటంతో దీనిపై వైసీపీ నేతలు ఫిర్యాదు మేరకు పిల్లలు పోలీస్ స్టేషన్ కు పిలిపించిన పోలీసులు ఒక పూట పిల్లలను పోలీస్ స్టేషన్ లోనే కూర్చోబెట్టారు. దీంతో ఈ విషయం తెలిసిన స్థానిక టిడిపి నేతలు విద్యార్థులను వ్యక్తిగత పూచీకత్తు మీద విడిపించి తీసుకువెళ్లారు. ఇక ఈ ఘటనపై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే పిల్లల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టి బెదిరించడమా వైయస్ జగన్ గారు ? వైసిపి నాయకుల పైశాచికత్వానికి అడ్డుఅదుపు లేకుండా పోయిందని లోకేష్ మండిపడ్డారు . ఇప్పటి వరకూ ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏకంగా చిన్నారులను పోలీస్ స్టేషన్ లో పెట్టి వికృత ఆనందం పొందుతున్నారు అంటూ పేర్కొన్నారు. ఆడుకుంటూ వెళ్లి ఫ్లెక్సీ చింపారని విద్యార్థులను రోజంతా పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి వేధించడం వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకి అద్దం పడుతోందని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ పాలన అరాచక పాలనగా మారిందని మండిపడ్డారు. బాలల హక్కులను కాలరాసే విధంగా చోటు చేసుకున్న ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన పట్ల పిల్లల తల్లిదండ్రులు , ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.