కాంగ్రెస్ కు ప్రశాంత్ హ్యాండ్ ఇవ్వడం ఫై రేవంత్ రియక్షన్

కాంగ్రెస్ పార్టీ కి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పెద్ద షాక్ ఇచ్చాడు. ప్రశాంత్ కిషోర్ రచించిన వ్యూహాలు మెచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా అధినేత్రి సోనియాగాంధీ ఆహ్వానించినప్పటికీ ప్రశాంత్ కిషోర్ ఆ ఆఫర్ ను తిరస్కరించాడు.

తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో..ఈఏజీలో భాగంగా పార్టీలో చేరడానికి మరియు ఎన్నికలకు బాధ్యత వహించాలని కాంగ్రెస్ అధినాయకత్వం చేసిన ఉదారమైన ప్రతిపాదనను తాను తిరస్కరించానని వెల్లడించారు. నా వినయపూర్వకమైన అభిప్రాయం ప్రకారం, కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా లోతుగా పాతుకుపోయిన నిర్మాణ సమస్యలను పరిష్కరించడానికి నా కంటే పార్టీకి నాయకత్వం మరియు సమష్టి సంకల్పం అవసరం అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. తాను పార్టీలో చేరినా, చేరకపోయినా అది ముఖ్యం కాదని, పార్టీని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

కాగా ప్రశాంత్ కిషోర్ నిర్ణయం ఫై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రశాంత్ కిషోర్ నిర్ణయం ఏంటో మాకు అధికారికంగా సమాచారం అందలేదని, ఆయన కాంగ్రెస్ లో చేరతారో లేదో అనేది ఆయన వ్యక్తిగతమని , కేసీఆర్ ఎవరితో గట్టుకట్టిన మిము వ్యతిరేకిస్తామని రేవంత్ అన్నారు. అది ప్రశాంత్ కిషోర్ అయినా మరొకరైనా అంతే అన్నారు. ప్రశాంత్ కాంగ్రెస్ లోకి వస్తే మంచిదని , రాకపోతే మరి మంచిందని రేవంత్ తేల్చి చెప్పారు.