బీజేపీతో పొత్తుపై చంద్రబాబు సమాధానం చెప్పాలి – వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని

BJPతో చంద్రబాబు ఏ విధంగా పొత్తు పెట్టుకుంటారని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ‘అధికారం, అవసరాలే తప్ప.. ప్రజల మనోభావాలు పట్టవా? పొత్తుపై AP ప్రజలకు BJP, TDP సమాధానం చెప్పాలి. మోడీ విమర్శించి, BJP ద్రోహం చేసిందని చెప్పి 2019లో NDA నుంచి బయటకొచ్చిన బాబు.. ఇప్పుడు ఏం న్యాయం జరిగిందని పొత్తు పెట్టుకుంటున్నారు? ఆ ద్రోహం ఎలా కడుక్కున్నారు? అనే అంశాలపై వివరణ ఇవ్వాలి’ అని నాని డిమాండ్ చేశారు.

ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రచారం మొదలుపెట్టగా..టిడిపి – జనసేన పార్టీలు ఇప్పటికే పొత్తు ఫిక్స్ చేసుకొని ఉమ్మడి అభ్యర్థులను ఎంపిక చేస్తూ ప్రచారానికి సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో బిజెపి పార్టీ సింగిల్ గా వెళ్తే ఏమాత్రం కలిసిరాదని , టిడిపి , జనసేన పొత్తు తో కలిసి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇరు పార్టీల అధినేతలను ఢిల్లీకి పిలిపించుకొని పొత్తు ఫై మాట్లాడుతున్నారు. దీంతో వైసీపీ నేతలు విమర్శలు చేయడం మొదలుపెట్టారు.