రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సోనియా గాంధీ భేటి

రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిసిన సోనియాగాంధీ

sonia-gandhi-meets-draupadi-murmu

న్యూఢిల్లీః కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ భారత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన సోనియాగాంధీ రాష్ట్రపతితో భేటీ అయ్యారు. వీరు భేటీ అయిన విషయాన్ని రాష్ట్రపతి భవన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. రాష్ట్రపతితో సోనియాగాంధీ సమావేశమయ్యారని తెలిపింది.

కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలతో అట్టుడుకుతున్న వేళ రాష్ట్రపతిని సోనియా కలిశారు. ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ అధ్యక్ష పదవికి ఆనంద్ శర్మ రాజీనామా చేశారు. అవమానాలను భరించే స్థితిలో తాను లేనని… రాజీనామా చేయడం మినహా తనకు మరో దారి లేదని ఆయన అన్నారు. ఆనంద్ శర్మకు నచ్చచెప్పేందుకు రాజీవ్ శుక్లాను కాంగ్రెస్ హైకమాండ్ పంపించింది. ఆనంద్ శర్మతో భేటీ అనంతరం సోనియాను కలిసేందుకు శుక్లా ఢిల్లీకి వెళ్లారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/