అమెరికా చరిత్రలోఇది అసాధారణం: బైడెన్‌ ప్రసంగం

విజయం సాధిస్తామనే నమ్మకంతో ఉన్నాం: అమెరికా ప్రజలనుద్దేశించి సందేశం

This is unusual in American history- Biden's speech
Biden’s speech

Washington: అమెరికా చరిత్రలో ఇది అసాధారణమైన విషయమని, గతంలో ఎన్నడూ లేనివిధంగా అధ్యక్ష ఎన్నికలు జరిగాయని డెమోక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థి బైడెన్‌ దేశ ప్రజలనుద్ధేశించి (భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో) మాట్లాడారు.

ఆయన డెలవేర్‌ రాష్ట్రం నుంచి ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 15 కోట్లకుపైగా ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని వెల్లడించారు.

ఇది సాధారణమైన విషయం కాదని చెప్పారు. అధ్యక్ష పదవికి కావాల్సిన 270 ఓట్లను సాధించటానికి అవసరమైన రాష్ట్రాలన్నింటిలో తాము విజయం కేతనం ఎగురవేస్తున్నామని తెలిపారు.

తాము ఈ ఎన్నికల్లో విజయం సాధించామని ప్రకటించేందుకు మీ ముందుకు రాలేదని అన్నారు..

అన్ని ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మేం విజయం సాధించగలమని నమ్మకంతో ఉన్నామని అన్నారు.

ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం బైడెన్‌ ఇప్పటిదాకా 237 ఎలక్టోరల్‌ ఓట్లను గెలుపొందారు.అధ్యక్ష పీఠానికి కావాల్సిన సంఖ్య 270 సాధించాలంటే ఇంకా ఆయన 33 ఓట్లు గెలుపొందాల్సి ఉంది.

కాగా మిచిగాన్‌లోని 16 ఎలక్టోరల్‌ ఓట్లను డెమోక్రాటిక్‌ సాధించినట్టు తెలిసింది.

ఇది అధికారికంగా వెల్లడి అయితే బైడెన్‌ గెలుపు దాదాపుగా ఖరారైందని భావించాల్సి ఉంది. కాగా ట్రంప్‌ 213 ఓట్లతో ఉన్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/