షర్మిలకు పేర్ని నాని కౌంటర్

ఏపీలో షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన దగ్గరి నుండి రాజకీయ సమీకరణాలు మరింత వేడెక్కాయి. వైసీపీ నే టార్గెట్ గా షర్మిల విమర్శలు సందిస్తుండడం తో..వైసీపీ నేతలు సైతం షర్మిల కు కౌంటర్లు ఇస్తున్నారు..ఇప్పటికే పలువురు నేతలు స్పందించగా.. పేర్ని నాని సైతం ఆ లిస్ట్ లో చేరిపోయాడు.

నాడు అన్న కోసం షర్మిల పాదయాత్ర చేసిందని… కానీ, తాము ఏ సంబంధం లేకపోయినా జగన్ కోసం జెండాలు మోశామని అన్నారు. ఎన్నికల్లో తన గెలుపు కోసం కుటుంబం మొత్తం ప్రచారం చేసిందని, అలాగని కుటుంబంలో అందరికీ పదవులు ఇవ్వడం కుదరదు కదా అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. షర్మిలను ఉద్దేశపూర్వకంగానే జగన్ పైకి ఉసిగొల్పుతున్నారని, కాంగ్రెస్ వెనుక ఉన్నది చంద్రబాబేనని ఆరోపించారు.