ఇళయరాజా కుమార్తె కన్నుమూత

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయని భవతరణి (47) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె.. గురువారం తుది శ్వాస విడిచారు. కొద్దీ రోజులుగా కాలేయ క్యాన్సర్‌ తో బాధపడుతున్న ఆమె.. చికిత్స పొందేందుకు శ్రీలంక కు వెళ్ళింది. అక్కడ ఆమె పరిస్థితి విషమించి గురువారం సాయంత్రం 5 గంటలకు మరణించారు.

భవతరిణికి గాయనిగా కోలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. 2000 సంవత్సరంలో వచ్చిన భారతి అనే సినిమాకు ఇళయరాజా సంగీతం అందించాడు. ఆ సినిమాలో మాయిల్‌ పోలా పొన్ను ఒన్ను అనే పాటను భవతరిణి పాడింది. ఈ పాటతో ఆమె నేషనల్‌ అవార్డు కూడా అందుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాలకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గానూ పనిచేసింది. చివరగా 2019లో వచ్చిన మాయానది అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకురాలిగా పనిచేసింది.

భవతరణి భౌతికకాయాన్ని రేపటిలోగా చెన్నైకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇళయారాజా కూతురు మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.