జపాన్ మాజీ ప్రధాని షింజో అబె కన్నుమూత

టోక్యోః జపాన్ మాజీ ప్రధాని షింజో అబె కన్నుమూశారు. ఓ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా దుండగుడి తుపాకీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన.. ప్రాణాలు విడిచినట్లు ఆ దేశ మీడియా ప్రకటించింది. కాగా, పశ్చిమ జపాన్‌లోని నారా నగరంలో జరిగిన ఓ సమావేశంలో షింజో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై మాట్లాడుతుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. దీంతో షింజో వేధికపై కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను సమీపంలోని దవాఖానకు తరలించారు. కాగా, తుపాకీ కాల్పుల శబ్ధం వినిపించిందని, ఆయనకు తీవ్రగాయం అయిందని జపాన్‌కు మీడియా పేర్కొన్నది. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/movies/