రేపటి నుండి తిరుపతి లో భారీ వర్షాలు..ప్రజలు ఎవరు బయటకు వెళ్లొద్దంటూ హెచ్చరిక

తిరుపతి నగరం ఫై మరోసారి వరుణుడు కన్నెర్రజేశాడు. బంగాళాఖాతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈ రోజు నైరుతి బంగాళా ఖాతం, దక్షిణ శ్రీలంక తీరముకు దగ్గర్లో సగటు సముద్ర మట్టానికి 3 .1 కిలోమీటర్లు ఎత్తులో విస్తరించిఉంది. ఉపరితల ఆవర్తనమునకు అనుభందముగా ఉపరితల ద్రోణి నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోనైరుతి బంగాళా ఖాతంమీటర్లు ఎత్తులో విస్తరించిఉంది. దీంతో దక్షిణ అండమాన్ సముద్రంలో ఈనెల 29 వ తేదీనాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

దీంతో రేపటి నుండి రాయలసీమలో భారీ వర్షాలు పడబోతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని..ఇళ్లలో నుండి బయటకు రాకూడదని , నిత్యావసరాలు ఏమైనా తెచ్చుకుంటే ఈరోజే తెచ్చుకోవాలని సూచించింది. గత కొద్దీ రోజులుగా రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాల ద్వారా వేలాది ఎకరాలు నీటిమట్టం అయ్యాయి. ఎన్నో వందల ఇల్లు వరదలో కొట్టుకుపోయాయి. పదుల సంఖ్యలో మనుషుల ప్రాణాలు పోయాయి. ఈ వరద ఉదృతి నుండి ఇంకా తేరుకోకముందే మరోసారి భారీ వర్షాలు పడబోతున్నాయి.