కరోనా ఫ్రీ సర్టిఫికేట్‌ ఉంటేనే భారత్‌లోకి అనుమతి

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం

negative-COVID19-certificate-to-enter-India
negative-COVID19-certificate-to-enter-India

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) కేసులు రోజురోజు పెరిగిపోతున్నాయి. కాగా దేశవ్యాప్తంగా సుమారు 60 మందికి ఈవైరస్‌ బారిన పడ్డారు. ఈనేపథ్యలో అప్రమత్తమైన కేంద్రప్రభుత్వం కరోనా వైరస్‌ వ్యాప్తిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే చైనా సహా ఇతర దేశాల పౌరులకిచ్చే అన్ని రకాల వీసాలపై పలు ఆంక్షలు తీసుకొచ్చింది. తాజాగా ఇటలీ, దక్షిణకొరియా నుండి భారత్‌కు వచ్చే వారు కరోనా ఫ్రీ సర్టిఫికేట్‌ తీసుకురావాలని స్పష్టం చేసింది. తమకు కరోనా లేదని నిర్ధారించే ‘నెగటివ్‌’ ధ్రవపత్రాని తీసుకురావాల్సి ఉంటుందని ఆరోగ్యశాఖ సూచించింది. ఆ సర్టిఫికేట్‌ ఉన్న వారిని మాత్రమే దేశంలోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. అయితే ఈనిబంధనను మారి 10 నుండి అమల్లోకి తీసుకొచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ఆడ్వైజరీల తెలిపింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/