ప్రత్యర్థులను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం

పోటీ చేయనివ్వనప్పుడు ఎన్నికలు ఎందుకు?: అచ్చెన్నాయుడు

Achennayudu
Achennayudu

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను నామినేషన్‌ కూడా వేయకుండా అధికార పార్టీ అడుగడుగునా అడ్డుతగులుతుందని టిడిపి నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రత్యర్థులకు పోటీ చేసే అవకాశం ఇవ్వనప్పుడు ఇక ఎన్నికలు నిర్వహించి ఏం లాభమని సిఎం జగన్‌ను ఆయన ప్రశ్నించారు. నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెళ్తున్న ప్రత్యర్థుల నామినేషన్‌ ప్రతాలు గుంజుకుని, చించేసి వారిని బెదిరిస్తున్నారని ఆయన అన్నారు. పోటీ చేయకుండా అడ్డుకోవడం నీచ రాజకీయం కాదా అని మండిపడ్డారు. అధికారం చేతిలో ఉందని, అధికారులను గుప్పిట్లో పెట్టుకుని ఓ నియంతలా వ్యవహరించడం సరికాదన్నారు. పోటీ చేయనివ్వకుండా ప్రత్యర్థులను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని ఆయన ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/