కామెంటేటర్‌గా రాణించవచ్చు..

ఇంగ్లీష్ భాషపై పట్టు సాధిస్తే అవకాశాలు

Cricket Commentators

ఇంగ్లిష్‌ కామెంటరీ ద్వారా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులకు చేరువకావచ్చు. మంచి కామెంటేటర్‌గా ఎదగడానికి ఇంగ్లిష్‌ భాషను సులభంగా, అవలీలగా మాట్లాడే స్కిల్‌ ఉండాలి. ఇటీవల కాలంలో తెలుగులోనూ కామెంటరీ పెరిగింది డిజిటల్‌ వేదికలు, తెలుగు చానల్స్‌ కామెంటరీ ప్రారంభించాయి. వీటిల్లో రేడియో జాకీలుగా పనిచేసిన వారికి అవకాశాలు లభిస్తున్నాయి.

నైపుణ్యాలున్న క్రికెట్‌ కామెంటేటర్ల సంఖ్య చాలా తక్కువ. కాబట్టి జాబ్‌ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. అయితే కామెంటేటర్‌ అనుభవం, నైపుణ్యాన్ని బట్టి వేతనం లభిస్తుంది. స్కిల్‌ ఉంటే ఆకర్షణీయ వేతనాలు అందుకునే వీలుంది. రోజు లెక్కల ప్రకారం, మ్యాచ్‌ల ఆధారంగా పే ఉంటుంది.

కనిష్టంగా రూ.2 లక్షలు-రూ.3 లక్షల నుంచి జీతభత్యాలు మొదలవుతాయి. అనుభవం, గుర్తింపుతో రూ.10 లక్షలకు పైనే వార్షిక జీతభత్యాలు లభించే అవకాశం ఉంది. కామెంటేటర్‌ కావాలంటే క్రికెట్‌ ప్రాథమిక అంశాలపై అవగాహన తప్పనిసరి, రంజీ వరకు కాకున్నా, లీగ్‌ క్రికెట్‌, కాలేజీ లెవల్‌ వరకు అయినా క్రికెట్‌ ఆడి ఉండాలి.

ఇంగ్లిష్‌ లేదా తెలుగు భాషపై పట్టుతోపాటు మాట కారితనం అవసరం ఆటమీద సంపూర్ణమైన అవగాహనతోపాటు దాన్ని వ్యక్తపరిచే నైపు ణ్యం ఉండాలి. అంతేకాకుండా గలగలగా,గట్టిగా మాట్లాడే వారికి కామెంటేటర్‌ కెరీర్‌ సెట్‌ అవుతుంది.

Commentators

స్టార్‌స్పోర్ట్స్‌, సోనీ లైవ్‌, జియో టివి, డిజిటల్‌ హక్కులు తీసుకొని తెలుగులో మొబైల్‌ ద్వారా మ్యాచ్‌లు ప్రసారం చేస్తున్నాయి. అలాగే ఆల్‌ ఇండియా రేడియోలో సైతం తెలుగులో కామెంటరీ ఇచ్చే అవకాశం ఉంది. దీనివల్ల తెలుగులోనూ అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రాంతీయ భాషల్లో వ్యాఖ్యానానికి ఆదరణ పెరుగుతున్నట్లు చెబుతున్నారు.

హిందీ భాష తర్వాత తెలుగు ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అలాగే కావెంటేటర్స్‌లోనూ లీడ్‌ కామెంటేటర్స్‌, ఎక్స్‌పర్ట్‌ కామెంటేటర్స్‌ అని రెండు రకాలుగా ఉంటారు. లీడ్‌ కామెంటేటర్స్‌ మ్యాచ్‌ పరిచయం, అతిథులు ఇంటర్వ్యూలు వంటి పనులు చేస్తుంటారు.

ఎక్స్‌పర్ట్‌ కామెంటేటర్స్‌ క్రికెట్‌ టర్మినాలజీపై దృష్టి పెడతారు. ఒక ఆటగాడు ఔట్‌ అయినప్పుడు రీప్లేలో దాన్ని టెక్నికల్‌గా వివరిస్తారు. మన దగ్గర కామెంటేటరీ కోర్సులు అందుబాటులో లేవు. కానీ స్టార్‌స్పోర్ట్స్‌ వంటి చానల్స్‌ సొంతంగా శిక్షణ ఇస్తున్నాయి.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/