కేటీఆర్ ఫై దాడి చేసిన వ్యక్తులు అరెస్ట్

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్..నిర్మల్ జిల్లా భైంసాలో ప్రచారం చేస్తుండగా చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రసంగిస్తుండగా..కొంతమంది హనుమాన్ భక్తులు ఆయనపై ఉల్లిగడ్డలు , టమాటాలు తో దాడి చేసారు. ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఓ పక్క దాడి చేస్తున్న పోలీసులు పట్టించుకోకుండా ఉండడం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు కేటీఆర్.

ఆ తర్వాత పోలీసులు వారిని అక్కడి నుండి పంపించారు. కేటీఆర్ పై టమాటాలతో విసిరిన 23 మంది హనుమాన్ దీక్షాపరులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని వెంటనే విడుదల చేయాలని హనుమాన్ భక్తులు, బీజేపీ నేతలు పీఎస్ ముందు ఆందోళనకు దిగారు. కేటీఆర్ హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిలో తనకు ఎలాంటి గాయం కాలేదని ట్వీట్ చేశారు. తాను పూర్తిగా క్షేమంగా ఉన్నానన్న కేటీఆర్.. మతం పేరుతో విషం చిమ్మడం, ద్వేషాన్ని వ్యాప్తి చేసే దుండగులతో తన పోరాటం కొనసాగిస్తూనే ఉంటానన్నారు.