ఎన్నికలు కాగానే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది – ఎంపీ ధర్మపురి అర్వింద్

లోక్ సభ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేసారు. లోక్ సభ ఎన్నికలు పూర్తికాగానే తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ పార్టీ నేతలే పడేస్తారని తెలిపారు. ఉత్తమ్, కోమటిరెడ్డి తలచుకుంటే ప్రభుత్వం పడిపోవడం ఎంత సేపు అన్నారు. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. బిజెపి అధికారంలోకి రాగానే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ తప్పుడు , నెరవేరని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఐదేళ్లల్లో నా ఫై ఒక్క అవినీతి ఆరోపణ లేదన్న అరవింద్..తనకంటే ముందు ఉన్న ఎంపీ..ఇప్పుడు అవినీతి చేసి జైల్లో ఉందని కవిత ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. అవినీతి చేసే రోజు వస్తే తాను రాజకీయాలను వదిలేస్తానని చెప్పుకొచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు తీసుకొచ్చానని తెలిపారు.