పీవీఆర్ సంస్థతో ట్రిపుల్ఆర్ భారీ డీల్..

యావత్ సినీ ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం RRR (ఆర్ఆర్ఆర్). బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడం..ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలు గా నటిస్తుండడం..పాన్ ఇండియా మూవీ గా రాబోతుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొనిన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 07 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ తరుణంలో ఈ మూవీ సరికొత్త రికార్డు సృష్టించింది.

ఇండియాలో ఫస్ట్ టైం అతి పెద్ద మల్టీ ప్లేక్స్ చైన్ సిస్టం కలిగిన పీవీఆర్ సంస్థతో ఆర్ఆర్ఆర్ భారీ డీల్ కుదుర్చుకుంది.. ట్రిపుల్ ఆర్ సినిమాతో అసోసియేట్ అయింది పీవీఆర్ సినిమాస్. PVR సినిమాస్‏కి సంబంధించిన అన్ని మల్టీప్లెక్స్‏ల పేరు PVRRR గా మార్పు చేశారు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ వరకు PVR సినిమాస్ PVRRR గా కనపడనుంది. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదొక రికార్డ్ అని కొంతమంది అంటుంటే..ఇక రిలీజ్ తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో అని మరికొంతమంది మాట్లాడుకుంటున్నారు.