సోదరా..అక్బరుద్దీన్ 15 సెకన్ల సమయం ఇస్తే చాలు: నవనీత్ కౌర్

bjp-navneet-rana-issues-open-challenge-to-owaisi-brothers

న్యూఢిల్లీః బీజేపీ ఎంపీ అభ్యర్థి నవనీత్ రానా గురువారం ఒవైసీ సోదరులకు సవాల్ విసిరారు. మాకు 15 నిమిషాలు కాదు… 15 సెకన్ల సమయం ఇస్తే చాలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలు ఎక్కడి నుంచి వచ్చారో… ఎక్కడికి వెళతారో తెలియకుండా ఉంటుందని హెచ్చరించారు. హైదరాబాద్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా నవనీత్ కౌర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా 2013లో అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 15 నిమిషాలు పోలీసులు తప్పుకుంటే 100 కోట్ల మంది హిందువుల అంతు చూస్తామని హెచ్చరించారు. నాటి ఈ వ్యాఖ్యలకు నవనీత్ కౌర్ కౌంటర్ ఇచ్చారు.

Jకాగా, నవనీత్ కౌర్ మాట్లాడుతూ.. ‘సోదరా, (అక్బరుద్దీన్) 15 నిమిషాలను పోలీసులను తప్పిస్తే ఏం చేస్తామో చూస్తామని మీరు అన్నారు. కానీ సోదరా, మేం 15 సెకన్లు పోలీసులను తొలగిస్తే చాలని అంటున్నాం’ అని వ్యాఖ్యానించారు.

మరోవైపు నవనీత్ రానా వ్యాఖ్యలకు అసదుద్దీన్ కౌంటర్ ఇచ్చారు. మీరు 15 సెకండ్లు అడుగుతున్నారు… ప్రధాని మోడీని ఒకటి అడుగుతున్నాను..గంట సమయం ఇవ్వండని కోరుతున్నానన్నారు. అప్పుడు మీలో ఎంత మానవత్వం మిగిలి ఉందో తెలుసుకోవాలనుకుంటున్నామన్నారు. ఎవరు భయపడేవాళ్లు ఉన్నారు? మేం సిద్ధంగానే ఉన్నామని వ్యాఖ్యానించారు. ప్రధాని మీవారు… ప్రభుత్వం మీది… ఆరెస్సెస్ మీది… ఎవరు ఆపుతున్నారు… ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తానని సవాల్ చేశారు. ఏం చేస్తారో చేయండన్నారు.