చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన పవన్ కళ్యాణ్

pawan-reacts-on-chandrababu-arrest

అమరావతిః చంద్రబాబు అరెస్ట్ ఖండిస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ పై ఓ వీడియో విడుదల చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రాధమిక ఆధారాలు చూపకుండా అర్దరాత్రి అరెస్టు చేసే విధానానాన్ని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అవలంబిస్తుందని..గత యేడాది అక్టోబర్ లో విశాఖలో కూడా జనసేన పట్ల ఏ విధంగా వ్యవహరించారో అందరూ చూశారని మండిపడ్డారు.

ఏ తప్పూ చేయని జనసేన నాయకుల పై హత్యాయత్నం కేసు పెట్టి అన్యాయంగా అరెస్టు చేశారని.. నేడు చంద్రబాబు అరెస్టు చేసిన తీరును సంపూర్ణంగా జనసేన ఖండిస్తుందని పవన్‌ కళ్యాణ్‌ వెల్లడించారు. పాలనా పరంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి పట్ల అనుసరిస్తున్న వైఖరి కరెక్టు కాదని.. చిత్తూరులో కూడా ఇదే విధంగా చంద్రబాబు పట్ల ప్రభుత్వం వ్యవహరించిందని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సిపి నాయకులు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే.. వైఎస్‌ఆర్‌సిపి, ప్రభుత్వం, పోలీసులు ఊరుకోమని అంటున్నారన్నారు.