టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి అస్వస్థత

తోపులాటలో కిందపడిపోయిన నిమ్మల

tension-situation-at-tdp-nimmala-rama-naidu-house

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు నిరసనలు తెలుపుతున్నాయి. టిడిపి నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు పాలకొల్లులో టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇంటివద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కిందపడిపోయారు. అస్వస్థతకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించేందుకు టిడిపి కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే పోలీసులు అందుకు ఒప్పుకోవడంలేదంటూ వారు మండిపడ్డారు. ఎమ్మెల్యేకి ఏదైనా జరిగితే అందుకు పోలీసులదే బాధ్యత అని హెచ్చరించారు.