సిట్ నోటీసుల ఫై రేవంత్ రెడ్డి క్లారిటీ

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి సిట్ నోటీసులు జారీ చేశారనే వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. పేపర్ లీక్ మొత్తం మంత్రి కేటీఆర్​ ఆఫీసు నుంచే వ్యవహారం సాగిందని, మంత్రికి తెలియకుండా ఇదంతా జరుగుతుందా? అని రేవంత్ ఇటీవల ప్రశ్నించారు. ఇందులో కేటీఆర్​ పాత్ర కూడా ఉందని , ఈ కేసులో ఏ2గా ఉన్న రాజశేఖర్,​ మంత్రి కేటీఆర్​ పీఏ తిరుపతి ఇద్దరూ దోస్తులని, రాజశేఖర్​కు ఉద్యోగం ఇప్పించింది మంత్రి పీఏనేనని, ఆయన సూచనలతోనే ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగికి ప్రమోషన్ ఇచ్చి టీఎస్​ పీఎస్సీకి బదిలీ చేశారని రేవంత్​ ఆరోపించారు. మంత్రి పీఏ తిరుపతే దీనికి ప్రధాన సూత్రధారి అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సీట్ సీరియస్ గా తీసుకుంది. రేవంత్ వద్ద ఉన్న ఆధారాలను తమకు అందించాలని సిట్ ఏసీపీ కోరారు. పేపర్ లీక్ పై ఆరోపణలు చేసే రాజకీయ నాయకులకు సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే సిట్ నోటీసులు తనకు అందలేదని, అందితే స్పందిస్తానని రేవంత్ తెలిపారు. నోటీసులలో ఏముందో తనకు తెలియదని, అవి తనకు అందిన తర్వాత స్పందిస్తానని చెప్పారు. నోటీసులకు భయపడేది లేదని అన్నారు. తమ దగ్గర ఉన్న ఆధారాలు సిట్ కు ఇవ్వమని, సిట్టింగ్ జడ్జ్ ద్వారా విచారణ జరిపితేనే ఇస్తామని పేర్కొన్నారు. ఈ కేసును కావాలనే నీరు గార్చె ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.