భారీ యాక్షన్ పార్ట్ తో ఓజి స్టార్ట్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓ పక్క సినిమాలు చేస్తూనే ..మరోపక్క రాజకీయ కార్యక్రమాలతో బిజీ గా ఉన్నారు. ఒకటి, రెండు కాదు ఏకంగా సెట్స్ ఫై మూడు సినిమాలు ఉంచారు. వాటిలో సాహో డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్లో ఓజి ఒకటి. రీసెంట్ గా ఈ మూవీ ప్రారంభం కాగా అతి త్వరలో మొదటి షెడ్యూల్ మొదలు కాబోతున్నట్లు మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.

మొదటి షెడ్యూల్ ను పవన్ కళ్యాణ్ భారీ యాక్షన్ పార్ట్ తో స్టార్ట్ చేయనున్నట్టుగా సమాచారం. ఇక ఓజీ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు సహా తమిళం , మలయాళం , కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా… డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఇక ఈ మూవీ తో పాటు హరిహర వీరమల్లు, వినోదయ సితం, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తున్నాడు.