పుష్ప 2 ప్రమోషన్ కు భారీగా ఖర్చు చేయబోతున్న మైత్రి మేకర్స్

సుకుమార్ – అల్లు అర్జున్ కలయికలో పుష్ప పార్ట్ 1 రాగ..ఇప్పుడు పార్ట్ 2 రాబోతుంది. పుష్ప రిలీజ్ అయ్యి దాదాపు ఏడాదిన్నర కావొస్తున్నా నేపథ్యంలో అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా పుష్ప 2 ట్రైలర్ విడుదల చేసి సినిమా ఫై అమాంతం అంచనాలు పెంచేశారు. ముఖ్యముగా అమ్మోరు తల్లి వేషంలో అల్లు అర్జున్ లుక్ దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది.

ఈ పోస్టర్ ను ఏకంగా నార్త్ లో అన్ని ప్రముఖ పత్రికలలో ఫ్రంట్ పేజీ ప్రకటనగా వేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. వాస్తవానికి ఫ్రంట్ పేజీ ప్రకటనలని కేవలం షాపింగ్ మాల్స్ లేదా ఇతర ప్రభుత్వం సంబందిత కార్యక్రమాలవై ఉంటాయి. సినిమా ప్రకటనలు పత్రికలలో ప్రచురించడం చాల అరుదుగా జరుగుతుంది. అయితే పుష్ప టీమ్ మాత్రం సినిమాని వీలైనంత ఎక్కువగా మార్కెట్ లోకి పంపించడం కోసం ఇప్పటి నుంచే ప్రమోషన్ కోసం గట్టిగా ఖర్చు చేయడానికి డిసైడ్ అయినట్లుగా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తుంది. మరి సినిమా రిలీజ్ టైం లో ఇంకెంత ఖర్చు చేస్తారో అని అంత మాట్లాడుకుంటున్నారు.