బిగ్ బాస్ 5 : బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ టైం ఈ సీజన్ లో ఇలా జరిగింది

బిగ్ బాస్ 5 సీజన్ తెలుగు లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. 8 వారానికి గాను ఇంటి నుండి లోబో బయటకొచ్చాడు. ఇక 9 వారానికి సంబదించిన నామినేషన్ ఎప్పటిలాగానే వాడి వేడిగా సాగింది. కెప్టెన్ షన్ముఖ్ తప్ప మిగితా వారందరూ నామినేట్ అయ్యి.. బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఈ వారం ఇంటి సభ్యులందరూ నామినేట్ కావడంతో ఎవరు ఇంటి నుంచి వెళ్ళిపోతారనేది ఆసక్తిగా మారింది.

నామినేట్ అయినా ఇంటి సభ్యులు ఎవరనేది చూస్తే..

అనీ మాస్టర్, జస్వంత్ పడాల, ఆర్జే కాజల్, విశ్వ, మానస్, ప్రియాంక, యాంకర్ రవి, సిరి హన్మంతు, శ్రీరామచంద్ర, వీజే సన్నీ నామినేట్ అయ్యారు. కెప్టెన్ కావడంతో షణ్ముఖ్ జస్వంత్ నామినేషన్ నుంచి సేఫ్ అయ్యారు. అంతకు ముందు బిగ్ బాస్ హౌస్ లో దీపావళి వేడుకలు తారాస్థాయి లో జరిగాయి. యాంకర్ సుమ, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్లు ముక్కు అవినాష్, బాబా భాస్కర్, అరియానా గ్లోరి, సయ్యద్ సోహైల్, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, శ్రీయా సరన్ ఇంటి సభ్యులతో సందడి చేసారు.