నేడు భీమిలి నియోజకవర్గంలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన

జనసేన ధినేత పవన్ కళ్యాణ్ నేడు భీమిలి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎర్రమట్టి కొండలను ఆయన పరిశీలించనున్నారు. ప్రకృతి సంపదను రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం ధ్వంసం చేస్తున్నారని పవన్‌ కల్యాణ్‌ ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎర్రమట్టి కొండలను ఈరోజు పరిశీలించనున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫోకస్ అంత రాష్ట్ర రాజకీయాలపైనే పెట్టారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే గతంలో కాకుండా పూర్తిగా ప్రజల మధ్య ఉంటూ వస్తున్నారు. వరుస వారాహి యాత్ర లు చేస్తూ..పార్టీ నేతలతో , కీలక సభ్యులతో భేటీ అవుతూ వస్తున్నారు. నిన్న 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనంతరం వీరమహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అక్రమాస్తులు, దోపిడీపై సమాచారం ఇచ్చే వారికి గిఫ్ట్ ఇచ్చేలా ప్రత్యేక కార్యక్రమం తీసుకువస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తమ పాలనలో అవినీతి, అక్రమాలకు తావిచ్చే ప్రసక్తే లేదని వెల్లడించారు.