ఆర్ఆర్ఆర్ : 10 రోజులకు గాను అలియా రూ. 5 కోట్ల రెమ్యునరేషన్

ఆర్ఆర్ఆర్ : 10 రోజులకు గాను అలియా రూ. 5 కోట్ల రెమ్యునరేషన్

బాహుబలి తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంతో సహ అనేక బాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించడం..భారీ బడ్జెట్.. బాలీవుడ్, హాలీవుడ్ ఫేమస్ యాక్టర్స్ నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

ఇక ఈ మూవీ లో చరణ్ కి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పాత్ర కోసం అలియా భారీగానే డిమాండ్ చేసిందని తెలుస్తుంది. 10 రోజుల షూటింగ్ కి గాను ఈ బ్యూటీ ఏకంగా రూ.5 కోట్లు డిమాండ్ చేసిందట. అంటే రోజుకి 50 లక్షలు చొప్పున అలియాకి ఆర్.ఆర్.ఆర్ నిర్మాతలు చెల్లించారు. వాస్తవానికి బాలీవుడ్ లో ఈ అమ్మడు ఒక్కో సినిమాకు 9 నుంచి 10 కోట్లు అందుకుంటుంది. రెండు నెలలు కాల్షీట్లు కేటాయిస్తుంది. కానీ ఆర్.ఆర్.ఆర్ విషయంలో మాత్రం 15 నిమిషాల కోసం 5 కోట్లు డిమాండ్ చేయడం మరి దారుణం.