నారా లోకేష్ కు పవన్ కళ్యాణ్ ఫోన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్..నారా లోకేష్ కు ఫోన్ చేసారు. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో జగన్ నియంత పాలనపై కలిసి పోరాడుదాం అని లోకేశ్‌కు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ ధైర్యం నింపినట్లు సమాచారం. జగన్‌ సర్కార్‌ గురించి భయపడవద్దని పవన్ కళ్యాణ్ కోరారు. ఈరోజు టీడీపీ బంద్ కి కూడా జనసేన మద్దతు ఇచ్చిన విషయాన్ని తెలియజేశారు పవన్. జనసేన శ్రేణులు బంద్ కి సహకరించాలని పవన్ ఇదివరకే చెప్పారు.

ఇక జనసేన నుంచి ఊహించని స్థాయిలో మద్దతు లభించడం టీడీపీ శ్రేణుల్లో ఆనందం నింపుతుంది. పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి రావడం, ఆయన్ను అడ్డుకోవాలని పోలీసులు చూసినా కూడా వారిని ఎదిరించి రావడం టీడీపీకి ఊరటనిచ్చింది. తమ అధినేత కోసం పవన్ అంత సాహసం చేశారనే ఆలోచన కూడా వారిలో ఉంది. అటు జనసైనికులకు కూడా చంద్రబాబు అరెస్ట్ తో జగన్ వ్యూహం తెలిసొచ్చింది. పవన్ ని కూడా పోలీసులు అడ్డుకోవడంతో ఏపీలో పరిస్థితులపై ఓ అవగాహన వచ్చింది. పవన్ ఒంటరిగా పోరాటం చేయడం కంటే, టీడీపీతో కలసి వైసీపీని ఎదుర్కోవడం మేలని జనసైనికులు డిసైడ్ అయ్యారు. టీడీపీకి మద్దతుగా జిల్లాల నుంచి ప్రెస్ మీట్లు పెట్టి జగన్ పై విమర్శలు చేస్తూ, నిరసనలు, ధర్నాల్లో కలసి పాల్గొంటున్నారు.