పఠాన్‌కోట్ దాడి సూత్రధారి షాహిద్ కాల్చివేత!

గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతం

Pathankot attack mastermind, Shahid Latif, killed by unidentified gunmen in Pak

న్యూఢిల్లీః భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, పఠాన్‌కోట్ దాడి సూత్రధారి షాహిద్ లతీఫ్ ఈ ఉదయం హతమయ్యాడు. పాకిస్థాన్‌లోని సియోల్‌కోట్‌లో గుర్తుతెలియని సాయుధులు అతడిని కాల్చిచంపారు. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ సభ్యుడైన 41ఏళ్ల షాహిద్‌పై భారత్‌లో పలు కేసులున్నాయి. 12 నవంబరు 1994లో ఉపాచట్టం కింద అరెస్ట్ అయిన అతడు 16 ఏళ్లపాటు జైలు జీవితం గడిపాడు.

2010లో వాఘా బోర్డర్ ద్వారా పాక్ చేరాడు. 2 జనవరి 2016లో పఠాన్‌కోట్‌లో జరిగిన ఉగ్రదాడిలో అతడు కీలక పాత్ర పోషించాడు. సియోల్‌కోట్ నుంచే ఈ దాడిని పర్యవేక్షించిన షాహిద్.. ఇందుకోసం నలుగురు ఉగ్రవాదులను పంపాడు.

కాగా, 1994, నవంబర్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కింద లతీఫ్‌ను పోలీసులు భారత్‌లో అరెస్టు చేశారు. 2010లో జైలు నుంచి విడుదలైన అతడు.. వాఘా సరిహద్దుల మీదుగా పాకిస్థాన్‌కు పరారయ్యాడు. అనంతరం జైషే మహమ్మద్‌లో చేరిన అతడు భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. 1999లో జరిగిన ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం హైజాక్‌లో అతడు నిందితుడిగా ఉన్నాడు. అయితే నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ అతడిని మోస్ట్‌వాంటెడ్‌ టెర్రరిస్టుగా ప్రకటించింది.