తమిళనాడు అసెంబ్లీ లో పవన్ ప్రస్తావన..

తమిళనాడు అసెంబ్లీ లో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫై ప్రశంసలు కురిపించారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ లో తమిళనాడు సీఎం స్టాలిన్ పాలనపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావటానికి రాజకీయం చెయ్యాలి కానీ.. ప్రభుత్వంలోకి వచ్చాక రాజకీయం చెయ్యకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, మీ ప్రభుత్వ పని తీరు మీ ఒక్క రాష్ట్రానికే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని రాజకీయ పార్టీలకు మార్గదర్శకం… స్ఫూర్తిదాయకం. మీకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియచేస్తున్నాను. మీకు నా శుభాకాంక్షలు.” అని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో కొనియాడారు.

ఈ ట్విట్ ని అసెంబ్లీలో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యన్ ప్రస్తావిస్తూ.. పవన్ కళ్యాణ్ ట్వీట్ ని తెలుగులో చదివి వినిపించారు. ఈ సందర్భంలో అసెంబ్లీలోని మిగిలిన ఎమ్మెల్యేలు, సీఎం స్టాలిన్ చిరునవ్వులు చిందించారు..పవన్ కళ్యాణ్ ట్విట్ తో పాటు, చిరంజీవి కలిసిన అంశాన్ని ప్రస్తావిస్తూ.. సీఎం స్టాలిన్ పై మంత్రి ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది.

YouTube video