వరంగల్ జిల్లాలో దారుణం..రైతును చెట్టుకు కట్టేసి చంపేశారు

రోజు రోజుకు క్రైం బాగా పెరిగిపోతుంది. కోర్ట్ లు , పోలీసులు ఎంత కఠినమైన శిక్షలు విదిస్తున్నప్పటికీ నేరగాళ్లు మాత్రం వారి ఆగడాలను ఆపడం లేదు. ఏమాత్రం భయం లేకుండా నేరాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ రైతు ను అతి దారుణంగా చెట్టుకు కట్టేసి ఫదునైన ఆయుధంతో గొంతులో పొడిచి అమానుషంగా అంతమొందించారు.

వివరాల్లోకి వెళ్తే

సంగెం మండలంలోని తీగరాజుపల్లి గ్రామానికి చెందిన సంపత్(50) అనే రైతుని దుండగులు అతి కిరాతకంగా చంపేశారు. రైతుని చెట్టుకి కట్టేసి ఫదునైన ఆయుధంతో గొంతులో పొడిచి దారుణంగా చంపారు. సంపత్ హత్య గ్రామంలో సంచలంగా మారింది. సంపత్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటన ఫై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.