అనంతపురంలో రెమ్‌డెసివిర్‌ బ్లాక్ మార్కెట్‌ ముఠా అరెస్టు

నిందితుల్లో సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ నర్సులు, సర్వజన ఆసుపత్రి పొరుగుసేవల సిబ్బంది

Remdesivir -File
Remdesivir -File

Anantapur: రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న ముఠాను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నర్సులు, ముగ్గురు జిల్లా సర్వజన ఆసుపత్రి పొరుగు సేవల ఉద్యోగులు ఉన్నారు. నిందితుల నుంచి 14 రెమ్‌డెసివిర్‌ సూది మందును, రూ.94 వేలను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ ప్రతాప్‌రెడ్డి వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నర్సులు సుకన్య, భారతి, సర్వజన ఆసుపత్రి పొరుగు సేవల ఉద్యోగులు రాజేష్‌, నరేంద్ర, కిశోర్‌నాయుడుతో పాటు విశ్వనాథరెడ్డి (రామచంద్రనగర్‌), సత్యనారాయణ (మాలవాండ్లపల్లి, నార్పల) ఉన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/