8 మందిని పెళ్లి చేసుకున్న కీలాడి లేడీ..ఇప్పుడు ఎయిడ్స్ తో బాధపడుతుంది

ఈరోజుల్లో కొంతమంది మహిళలు కూడా మోసాలకు పాల్పడుతున్నారు. డబ్బు కోసం దొంగతనాలు , దోపిడీలే కాదు అమాయకపు మగవారిని పెళ్లి పేరుతో మోసం చేసి వారి దగ్గరి నుండి భారీగా డబ్బు , నగదు తీసుకొని పారిపోతున్నారు. తాజాగా పంజాబ్ కు చెందిన ఓ కీలాడి లేడీ..ఏకంగా 8 మందిని పెళ్లి చేసుకొని వారి నుండి భారీగా నగదు రాబట్టుకొని..ఇప్పుడు తొమ్మిదో పెళ్లికి సిద్ధమైంది. కానీ పోలీసులు ఈమె బాగోతం బయటపెట్టి కటకటాల్లో వేశారు.

వివరాల్లోకి వెళ్తే…

హరియాణలోని కైతల్‌ జిల్లాకు చెందిన మహిళ (30) 2010లో పెళ్లి చేసుకొని.. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత భర్త ఇంటి నుంచి వెళ్లిపోవడంతో డబ్బు కోసం మోసాలకు పాల్పడడం మొదలుపెట్టింది. ఈమె కు తల్లి , బంధువులు సపోర్ట్ చేయడంతో రెచ్చిపోయింది. పెళ్లి పేరుతో అమాయకపు మగవారిని మోసం చేయడం..పెళ్లి చేసుకున్నాక వారం రోజులు కాపురం చేయడం..ఆ తర్వాత అతడి తో గొడవపడి బంగారం , డబ్బులతో పారిపోవడం చేస్తుంటుంది. ఆలా ఒకరి ఇద్దరు కాదు ఎనిమిది మందిని ఇలాగే మోసం చేసి వారి నుండి భారీగా డబ్బు లాక్కుంది. ఈ క్రమంలో తొమ్మిదో పెళ్లికి సిద్దమవుతున్న క్రమంలో పోలీసులు ఈమెను అరెస్ట్ చేసారు. వైద్య పరీక్షల్లో ఆమెకు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆమె పాత భర్తలందరికీ కూడా త్వరలో హెచ్‌ఐవీ పరీక్షలు చేయిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈమె ఫై పలు కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు.