నిర్మలా సీతారామన్ ను కలిసిన పవన్‌

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన పవన్, బిజెపి నేతలు

Pawan Kalyan
Pawan Kalyan

న్యూఢిల్లీ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. నాదెండ్ల మనోహర్ తో కలిసి ఢిల్లీలో అడుగుపెట్టిన పవన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. పవన్ తో పాటు బిజెపి తలు కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు, సునీల్ దేవధర్, పురందేశ్వరి కూడా భేటీ అయ్యారు. ఏపీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి అంశాల గురించి వారు నిర్మలా సీతారామన్ కు వివరించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/