ఢిల్లీలో భారీ వర్షం.. నీట మునిగిన రోడ్లు

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలతో పాటు రోడ్లన్నీ నీటమునిగాయి. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయం అవ్వడంతో విపరీతంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతాల్లో శుక్రవారం కూడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

భారీవర్షాల నేపథ్యంలో శుక్రవారం ఐఎండీ నోయిడా, గురుగ్రామ్ నగరాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే నోయిడా, గురుగ్రామ్ నగరాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో 3,4 గంటలపాటు భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ శుక్రవారం ట్వీట్ చేసింది. హర్యానాలో ప్రభుత్వ విపత్తు నిర్వహణ అథారిటీ..గుర్గావ్‌లోని కార్యాలయాలు, కార్పొరేట్‌లను శుక్రవారం ఇంటి నుంచి పని చేయమని ఉద్యోగులను కోరుతూ నోటీసును విడుదల చేసింది. ఢిల్లీలో పాఠశాలలకు సెలవుపై అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, చాలా ప్రైవేట్ పాఠశాలలకు సెలవు చ్చినట్టు తల్లిదండ్రులకు సందేశాలు వచ్చాయి. గుర్గావ్, ఫరీదాబాద్ జిల్లాల్లోనూ ఇదే విధంగా పలు ప్రైవేట్ పాఠశాలలు సెలవు ప్రకటించాయి.