ఆర్మిక్యాంప్‌పై దాడికి ఉగ్రవాదుల కుట్ర!

గణతంత్ర దినోత్సవాల సందర్భంగా అలజడులు సృష్టించాలని పథకం

terrorists
terrorists

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో సైనిక శిబిరాలపై ఉగ్రదాడి జరిగే అవకాశాలున్నాయని భారత నిఘావర్గాలు పసిగట్టాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖను హెచ్చరించాయి. భారత గణతంత్ర దినోత్సవాల సందర్భంగా కశ్మీర్‌తో పాటు జమ్మూలో కూడా అలజడులు సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నినట్లు నిఘా వర్గాలు తెలుపుతున్నాయి. జనవరి 26కు ముందే దాడులకు దిగేందుకు ఉగ్రవాదులు సిద్దమైనట్లు సమాచారం అందుతుంది. కాగా పూల్వామాలోని ఆపిల్‌ తోటల్లో 8 మంది ఉగ్రవాదులు ఇప్పటికే సమావేశమైనట్లు భారత ఇంటిలిజెన్స్‌ గుర్తించింది. ఈ 8 మంది ఉగ్రవాదుల్లో ఇద్దరు ఆత్మాహుతి దళాలుగా ఉన్నట్లు సమాచారం. జైషే మహ్మద్‌, హిజ్బుల్‌ ఉగ్రవాదుల మధ్య సమావేశం జరిగినట్టు నిఘా వర్గాలు తెలిపాయి. షోపియాన్‌లోని ఆర్మి క్యాంప్‌పై దాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు సమాచారం అందడంతో కేంద్ర హోంశాఖ ఆర్మీ, భద్రతా దళాలను అప్రమత్తం చేసింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/