అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్‌పై విచారణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు బుధవారం కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ ప్రస్తావనను లేవనెత్తారు ఏపి హోం మంత్రి సచరిత. కాగా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు అసెంబ్లీ తీర్మానం చేసింది. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని తెలిపిన ఆమె.. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో ఇంకా ఇన్సైడర్ ట్రేడింగ్ అంశంపై చర్చ జరుగుతూనే ఉంది. ఈ సందర్భంగా సభలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యె మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో 4070 ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని తెలిపారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరిపి దీనికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన వ్యాఖ్యానించారు. టిడిపి హయాంలోనే అమరావతి ప్రాంతంలో టిడిపి నేతులు, మంత్రులు, వారి బినామీలు భూములు కొనుగోలు చేసిన తర్వాతే రాజధానిగా అమరావతిని ప్రకటించారని వైఎస్ఆర్సిపి ఆరోపించింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/