యూపీలో దారుణం : కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మనవాడి హత్య

యూపీలో దారుణం చోటుచేసుకుంది. దివంగత కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కేదార్‌సింగ్ మనవడిని అతి దారుణంగా హత్య చేసారు. మవు జిల్లాలోని కోపాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. పాత కక్షల నేపథ్యంలో 35 ఏళ్ల హిమాన్షు సింగ్‌ను మహువార్ గ్రామంలో శనివారం రాత్రి 8 మంది కొట్టి చంపారు. హిమాన్షు మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు.

హిమాన్షు తాత దివంగత కేదార్ సింగ్ 1980లో ఘోసి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శనివారం రాత్రి కోపాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లైరో డోన్వార్ గ్రామంలో పంచాయతీకి హిమాన్షు వెళ్లారు. అక్కడ కొంతమంది వ్యక్తులతో ఆయనకు వాగ్వివాదం జరిగింది. దీంతో వారంతా కలిసి కర్రలతో ఆయనను దారుణంగా కొట్టారు. కొన ఊపిరితో ఉన్న ఆయనను మహువార్ గ్రామంలో పడేశారు. ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.