సిబిఎస్ఇ పదో తరగతి పరీక్షల రద్దు
బోర్డు వెల్లడి

New Delhi: కరోనా కేసుల పెరుగుదల కారణంగా సిబిఎస్ఇ బోర్డు పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రధాని మోదీతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణలో రోజుకు 3వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో స్టేట్ బోర్డులు కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను ప్రమోట్ చేయాలని డిమాండ్ వస్తోంది. ఇదిలావుండగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసే అవకాశముందని, త్వరలోనే ఆయా రాష్ట్రాల బోర్డులు ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/