తెలంగాణ ప్రజల పట్ల ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై పవన్ ఆగ్రహం…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..వైస్సార్సీపీ మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మంత్రులు చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. వెంటనే వారు తెలంగాణ ప్రజలకు క్షేమపణలు తెలుపాలని డిమాండ్ చేసారు. రీసెంట్ గా బిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు..ఏపీలో ప్రభుత్వ తీరు , అభివృద్ధి ఫై పలు వ్యాఖ్యలు చేసారు. దీంతో వైస్సార్సీపీ నేతలు హరీష్ రావు ఫై , తెలంగాణ ప్రజలను ఉద్దేశించి అతి దారుణంగా మాట్లాడారు. వీరి మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారడంతో తెలంగాణ ప్రజలు , యువత వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఏపీ మంత్రుల ఫై మండిపడ్డారు. హరీశ్ రావు ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదని… కానీ, ఏపీ మంత్రులు స్పందించిన తీరు మాత్రం దురదృష్ణకరమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక జాతిని అవమానించేలా ఏపీ మంత్రులు మాట్లాడుతుంటే వైస్సార్సీపీ సీనియర్ నేతలు ఏం చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు. విమర్శించాలనుకుంటే ఒక వ్యక్తిని విమర్శించాలే కానీ… తెలంగాణ రాష్ట్ర ప్రజలను విమర్శించడమేమిటని అన్నారు.

ఇటీవల ఒక కార్యక్రమంలో హరీశ్ రావు మాట్లాడుతూ… ఏపీకి, తెలంగాణకు భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. ఏపీతో పోలిస్తే హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఆసుపత్రులు ఎంతో బాగున్నాయని చెప్పారు. ఏపీలో రోడ్లు, ఇతర సౌకర్యాలు, సేవలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసని అన్నారు. ఏపీ నుంచి వలస కార్మికులు ఏపీలో ఓటును వదిలేసి, తెలంగాణలో ఉంచుకోవాలని సూచించారు.