రైతుల ఉద్యమం పై పృథ్వీరాజ్‌ వివాదస్పద వ్యాఖ్యలు

అమరావతిలో ప్రస్తుతం పెయిడ్‌ ఆర్టిస్టులతో రైతు ఉద్యమం జరుగుతుంది

Prudhvi Raj
Prudhvi Raj

అమరావతి: రాజధాని అమరావతిపై రైతులు చేస్తున్న ఉద్యమంపై వైఎస్‌ఆర్‌సిపి నేత, ఎస్వీబీసీ చైర్మన్‌ పృథ్వీరాజ్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం అమరావతిలో పెయిడ్‌ ఆర్టిస్టులతో రైతు ఉద్యమం జరుగుతోందని పృథ్వీరాజ్‌ ఆరోపించారు. వారు సాధారణ రైతులైతే ఆడి కార్లు, మహిళల చేతులకు బంగారు గాజులు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. పేరుకే రైతుల ఉద్యమం కానీ అక్కడ నడుస్తున్నది అంతా కార్పొరేట్‌ మయాజాలం అని ధ్యజమెత్తారు. రాజధానిపై పవన్‌ కళ్యాణ్‌కు ఇవేమి కనిపించడం లేద అని నీలదీశారు. కాగా దేవాలయాలపై డాక్యుమెంటరీలు తీసే క్రమంలో నిన్న ఒంగోలు చెన్నకేశవాలయాన్ని ఆయన దర్శించుకున్నారు. మన దేవాలయాలు అనే కార్యక్రమం ద్వారా ప్రాచీన, ప్రాశస్యం కలిగిన దేవాలయాల విశిష్టతను వెలుగులోకి తీసుకురానున్నట్లు ఎస్వీబీసీ చైర్మన్‌ తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/