జీ7 సమ్మిట్‌లో ప్రధాని మోడీకి ప్రెసిడెంట్ బైడెన్‌ ఆత్మీయ పలకరింపు

జీ7 సమ్మిట్‌లో ప్రధాని మోడీని అభినందించేందుకు స్వయంగా వెళ్లిన అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్

US President Joe Biden walks up to PM Modi to greet him

హిరోషిమా: ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జపాన్‌లోని హిరోషిమాలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. అక్కడ జరిగే ప్రతిష్ఠాత్మక G-7 దేశాల సదస్సులో మోడీ పాల్గొంటున్నారు. కాగా ఈ సమ్మిట్‌లో భారత్‌, జపాన్‌లతో పాటు అమెరికా, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, ఇండోనేసియా, దక్షిణ కొరియా, వియత్నాం తదితర దేశాల అధినేతలు ఈ జీ-7 సదస్సుకు హాజరయ్యారు. కాగా జీ-7 సదస్సులో భాగంగా ఒక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మంత్రి మోడీని పలకరించేందుకు స్వయంగా ఆయన ఉన్న వేదిక దగ్గరకు వచ్చారు అమెరికా అధ్యక్షులు బైడెన్‌. దీనిని గమనించి మోడీ కూడా లేచి బైడెన్‌ను పలకరించారు. ఇద్దరూ ఆత్మీయంగా మాట్లాడుకుంటూ ఆలింగనం చేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే ప్రఖ్యాత జపనీస్ రచయిత, హిందీ, పంజాబీ భాషావేత్త, పద్మశ్రీ డాక్టర్ టోమియో మిజోకామి, ప్రముఖ జపనీస్ చిత్రకారుడు హిరోకో తకయామాతో సమావేశమయ్యారు మోడీ. ప్రొఫెసర్ టోమియో మిజోకామి, హిరోకో తకయామాను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.