సామూహిక అత్యాచార ఘటన అమానుషం

ఆ మృగాళ్లను కఠినంగా శిక్షించాలి..పవన్‌ కల్యాణ్‌

pawan kalyan
pawan kalyan

అమరావతి: రాజమహేంద్రవరంలో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారనే వార్త తీవ్రంగా కలచి వేసిందని ఆయన తెలిపారు. అమానుషకరమైన ఈ ఘటన హృదయం ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తోందని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నాలుగు రోజుల పాటు చిత్ర హింసలకు గురి చేసిన ఆ మృగాళ్లను కఠినంగా శిక్షించాలని పవన్ కల్యాణ్‌ కోరారు. తన కుమార్తె ఆచూకీ తెలియడం లేదని తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే సకాలంలో స్పందించలేదని తెలిసిందని తెలిపారు. దిశ చట్టం, ప్రత్యేక పోలీసు స్టేషన్లు ఏమయ్యాయి? అని ఆయన ప్రశ్నించారు. బాలికపై సామూహిక అత్యాచార ఘటన అమానుషం అని పవన్ అన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/