కరోనా నియంత్రణలో సర్కార్ విఫలం

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలంగాణ సర్కార్‌పై మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. దీనికి సిఎం కెసిఆర్ బాధ్యత వహించాలన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి చర్యలు తీసుకోవాలన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో వసతులు పెంచాలన్నారు. పరీక్షలు సరిగ్గా జరపడంలేదని తాము మొదటినుంచి చెబుతున్నామన్నారు. టెస్టులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇబ్బందులు వస్తాయని, అయితే పారదర్శకంగా ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్పే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలని శశిధర్ రెడ్డి అన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/