ఉప ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్ కేనా..?

pawan-kalyan-comments-on-ysrcp

ఏపీలో కూటమి పార్టీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 అసెంబ్లీ , 21 పార్లమెంట్ స్థానాలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఈ నెల 12 న సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే పలువురు నేతలు సైతం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టబోతున్నట్లు సమాచారం. ఈ పదవి తీసుకునేందుకు పవన్‌ కల్యాణ్‌ సంసిద్ధత వ్యక్తం చేశారని ఇండియా టుడే ఛానల్‌ తెలిపింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రుల ప్రమాణ స్వీకారానికి పవన్‌కల్యాణ్‌ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఇండియా టుడే ఛానల్‌ రిపోర్టర్‌ పవన్‌ కల్యాణ్‌తో మాట్లాడారు.

రిపోర్టర్‌ ప్రశ్నలు, ఆయన సమాధానాలు కొంత అస్పష్టంగా వినిపించినా పవన్‌ ఏం మాట్లాడిందీ వినపడలేదు. ఆ ప్రశ్నల సందర్భంగా ఇండియా టుడే రిపోర్టర్‌ వ్యాఖ్యానిస్తూ పవన్‌ కల్యాణ్‌ ఏపీ ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ ఛానల్‌లో ఈ విషయంపై స్క్రోలింగ్‌ ప్రసారం చేశారు. ఏపీలో ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్లు జనసేన అధినేత వెల్లడించారని అందులో పేర్కొన్నారు. మరి నిజంగా పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నారా..? రేపు ఈ పదవి పవన్ కల్యాణే కే ఇవ్వబోతున్నారా అనేది చూడాలి.