ఫ్రీ బస్సు ..సీట్ల కోసం పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు

తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ..మహిళల కోసం ఫ్రీ బస్సు పథకం అమలు చేసింది. ఈ పథకం వల్ల లాభం కంటే నష్టమే వాటిల్లుతుంది. ముఖ్యంగా బస్సు లో సీట్ల కోసం మహిళలు జుట్లు పట్టుకొని పొట్టు పొట్టు కొట్టుకున్న ఘటనలు ప్రతిరోజు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు సంక్రాంతి టైం కావడం తో ఈ తరహా ఘటనలు ఎక్కువై పోతున్నాయి. తాజాగా ముధోల్ బస్సులో సీటు కోసం మహిళలు కొట్టుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఇక ఈ పథకం పెట్టిన దగ్గరి నుండి ఇదే సమస్య..ఫ్రీ అని చెప్పి మహిళలు పెద్ద ఎత్తున ప్రయాణం చేస్తుండడం తో మగవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూర్చునేందుకు సీటు లేకపోవడం తో వారంతా ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్న మీము నిల్చుని ప్రయాణం చేయాలా..? మాకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క ఆటో డ్రైవర్లు సైతం ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఈ పథకం అమలు చేసిన దగ్గరి నుండి మా జీవితాలు రోడ్డున పడ్డాయని..రోజు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాళ్లమని..ఇప్పుడు ఫ్రీ అని చెప్పి మా బ్రతుకులను ఆగం చేసారని ఆరోపిస్తూ ప్రభుత్వానికి పలు డిమాండ్స్ చేస్తున్నారు.